పెళ్లి కాకపోయినా చేయొచ్చు!

Poonam Kaur


నిన్న కర్వా చౌత్. బాలీవుడ్ సెలెబ్రిటీలు తమ ఫోటోలను షేర్ చేశారు. కర్వా చౌత్ నాడు పెళ్ళైన హిందూ మహిళలు రోజంతా ఉపవాసం ఉండి భర్త క్షేమం కోసం పూజలు చేస్తారు. ఉత్తరాదిలో ఈ సంప్రదాయం ఎక్కువ. బాలీవుడ్ హీరోయిన్లు తమ కర్వా చౌత్ ఫోటోలను పెట్టారు. కొత్తగా పెళ్లి చేసుకున్న కత్రిన కూడా షేర్ చేసింది.

Advertisement

ఈ పాత కాలం పద్దతిపై విమర్శలు కూడా ఉన్నాయి. మోడ్రన్ థింకింగ్ ఉన్నవాళ్లు చెయ్యరు. మన దక్షిణాదిలో ఈ సంప్రదాయం అస్సలు లేదు. ఐతే, తెలుగు హీరోయిన్ పూనమ్ కౌర్ (ఆమె హైదరాబాదీనే కానీ మూలాలు పంజాబ్ లో ఉన్నాయి) కూడా నిన్న కర్వా చౌత్ సెలెబ్రేట్ చేసుకొంది. ఫోటోలను షేర్ చేసింది.

దాంతో, పెళ్లి కాకుండా ఎవరి కోసం కర్వా చౌత్ చేస్తున్నావు? నీ భర్త ఎవరు? అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. అలాగే మీడియాలో కూడా ఆమెపై వార్తలు వచ్చాయి. దాంతో, ఈ రోజు వివరణ ఇచ్చింది పూనమ్ కౌర్.

పెళ్లి కాకున్నా అమ్మాయిలు కర్వా చౌత్ చేయొచ్చు అని క్లారిటీ ఇచ్చింది. రాబోయే కాలంలో కాబోయే భర్త కోసం అవాహిత స్త్రీలు కూడా కర్వా చౌత్ చేస్తారని… పెళ్లి కానీ తనలాంటి అమ్మాయిలు చేసే పద్దతి ఇదంటూ ఒక పెద్ద పోస్ట్ పెట్టింది.

Advertisement
 

More

Related Stories