టాలీవుడ్ హీరోయిన్ కు బెదిరింపులు

Poorna

పెళ్లి సంబంధం అంటూ ఇంటికొచ్చారు. పెళ్లి కొడుకు తరఫు బంధువులమని నమ్మించారు. కట్ చేస్తే.. ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డారు. హీరోయిన్ పూర్ణకు ఎదురైన చేదు అనుభవం ఇది. అయితే ఆమె బెదిరింపులకు లొంగలేదు. పోలీసులకు కంప్లయింట్ ఇచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. లాక్ డౌన్ కారణంగా కొచ్చిలో తన ఇంటికే పరిమితమైపోయింది పూర్ణ. ఆమెకు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారనే విషయం తెలుసుకున్న కొంతమంది కోజికోడ్ నుంచి వచ్చామని చెప్పి పరిచయం పెంచుకున్నారు. పూర్ణ వ్యక్తిగత వివరాలు తెలుసుకున్నారు.

తర్వాత అగంతకుల పేరిట ఫోన్ చేసి పూర్ణను బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు. లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో పూర్ణ, ఆమె తల్లి కొచ్చిలోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ ఇంటి చుట్టూ తిరుగుతున్న అనుమానితుల గురించి కూడా చెప్పారు.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. శరత్, అష్రఫ్, రఫీక్, రమేష్ అనే నలుగుర్ని అరెస్ట్ చేశారు. వీళ్లను చూసిన పూర్ణ తల్లి, అంతకుముందు వీళ్లు పెళ్లి సంబంధం అంటూ తమ ఇంటికి వచ్చిన వాళ్లుగా గుర్తించింది. ప్రస్తుతం ఈ నలుగురు ఊచలు లెక్కబెడుతున్నారు. 

Related Stories