కాబోయే భర్తను పరిచయం చేసిన పూర్ణ

మరో హీరోయిన్ పెళ్లికి సిద్ధమైంది. హీరోయిన్ పూర్ణ తనకు కాబోయే భర్తను ప్రపంచానికి పరిచయం చేసింది. దుబాయ్ కు చెందిన బిజినెస్ కన్సల్టెంట్ షానిద్ అసిఫ్ అలీని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలిపింది. తమ ఎంగేజ్ మెంట్ పూర్తయిందంటూ, ఓ ఫొటోను కూడా విడుదల చేసింది.

దాదాపు మూడేళ్లుగా పూర్ణకు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. కానీ మంచి సంబంధాలు సెట్ అవ్వడం లేదు. ఎట్టకేలకు షానిద్ రూపంలో ఆమెకు వరుడు దొరికాడు. అతడితో కలిసి జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నట్టు తెలిపింది పూర్ణ.

టాలీవుడ్ లో చాలా సినిమాలు చేసిన పూర్ణకు సరైన బ్రేక్ రాలేదు. దీంతో ఆమె టెలివిజన్ పై కూడా కన్నేసింది. కొన్ని టీవీ కార్యక్రమాలకు జడ్జిగా వ్యవహిస్తోంది. ఇలా ఓవైపు సినిమాలు, మరోవైపు టీవీ కార్యక్రమాలతో కెరీర్ ను లాగిస్తోంది. ఇప్పుడు పెళ్లితో ఆమె కెరీర్ కు ఫుల్ స్టాప్ పెడుతుందా లేక కొనసాగిస్తుందా అనేది చూడాలి.

 

More

Related Stories