సోనూ కన్నా గొప్పోళ్ళు మనోళ్లు!

Sonu Sood

లాక్డౌన్ తర్వాత దేశమంతా మార్మోగిన పేరు…. సోనూ సూద్. వలస కార్మికుల కష్టాలు చూసి చలించి వారికి బస్సులు ఏర్పాటు చేశాడు ఈ హీరో. ఆ తర్వాత ఎవరు ఏ సాయం అడిగినా … ట్విట్టర్ లోనే వారికి రిప్లై ఇచ్చి… వెంటనే తీర్చేస్తున్నాడు. ఇండియా అంతా హీరో అయిపోయాడు సోనూ సూద్.

అయితే, సోనూ సూద్ సాయం చేస్తున్న వైనం బాగున్నా…అతని పేరు చెప్పి మిగతా నటులను విమర్శించడం కరెక్ట్ కాదంటున్నారు పోసాని కృష్ణ మురళి. మన తెలుగు ఇండస్ట్రీలో కూడా సోను కన్నా గొప్ప సాయం చేసినవాళ్లు ఉన్నారట. అందరూ సోనూలా బయటికి చెప్పుకోరు… గుప్తదానాలు, సాయాలు చేసేవాళ్ళు ఉన్నారని అంటున్నారు పోసాని.

సోను రీసెంట్ గా సాయం అందించి పేరు తెచ్చుకున్నాడు. అదే “ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లాంటి వాళ్ళు కొన్నేళ్లుగా ఏ కష్టం వచ్చినా ఆడుకుంటున్నారు. చెన్నై వరదలు, ఉత్తరాఖండ్ ప్రకృతి ప్రళయం, హుదూద్ తుపాను, కరోనా చారిటీ… ఇలా ఎన్నో సందర్భాల్లో కోట్లలో సాయం అందించారు. అవి లెక్కలోకి రావా. ఒక్కసారి బిల్డప్ ఇచ్చుకుంటే సరిపోతుందా?”

ఇది పోసాని కృష్ణమురళి ప్రశ్న.

Related Stories