నాగ చైతన్యను ఈజీగా మోసం చేయొచ్చు

నాగ చైతన్యను ఈజీగా మోసం చేయొచ్చు

నాగచైతన్యను ఎవరైనా మంచోడు అనాల్సిందే. ఇప్పుడిదే విషయాన్ని మరోసారి రిపీట్ చేశారు నటుడు పోసాని కృష్ణమురళి. అక్కినేని హీరోలందర్లో తనకు నాగచైతన్య అంటేనే ఇష్టమంటున్నారు. చైతూను గౌతమ బుద్ధుడితో పోల్చారు పోసాని.

“నాగార్జునతో 2-3 సినిమాలు చేశాను. నాగచైతన్యతో మజిలీ లాంటి సినిమాలు చేశాను. అఖిల్ తో కూడా చేశాను. ప్రస్తుతం “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” అనే సినిమా కూడా చేస్తున్నాను. వీళ్ల ముగ్గుర్లో నాకు నాగచైతన్య ఇష్టం. నిజం చెప్పాలంటే నాగచైతన్య గౌతమబుద్ధుడు. చాలా నిజాయితీ ఉన్న వ్యక్తి. ప్యూరిఫైడ్ హార్ట్. ఆ అబ్బాయికి కల్లాకపటం, మోసం, ఆర్టిఫిషియల్ లాంటివేం తెలియవు. ఓ తెల్లకాగితం లాంటోడు. నాగచైతన్యను ఈజీగా ఎవరైనా మోసం చేయొచ్చు. అంతే ఈజీగా ప్రేమించొచ్చు. ఏదైనా నమ్ముతాడు. చాలా మంచి కుర్రాడు.

ఇలా చైతూపై తనకున్న ప్రేమను బయటపెట్టారు పోసాని. హీరోలంతా ఒకెత్తయితే.. నాగచైతన్య ఒక్కడు మరో ఎత్తు అంటున్నారు పోసాని. ఇండస్ట్రీలో నాగచైతన్య అంత మంచి వ్యక్తిని, క్లీన్ హీరోను తను చూడలేదంటున్నాడు.

 

More

Related Stories