ప్రభాకర్ జైనీ ‘స్వాతి’ బయోపిక్


“స్వాతి” వారపత్రిక ఒకప్పుడు సంచలనం. 15 ఏళ్ల క్రితం వరకు ఆ మేగజైన్ ని తెగ చదివేవారు. ఆయన జీవితాన్ని తెరకెక్కిస్తున్నారు రచయిత, దర్శకుడు ప్రభాకర్ జైనీ.

‘స్వాతి బలరాం – అతడే ఒక సైన్యం’ పేరుతో ఇది రూపొందనుంది. ‘క్యాంపస్ అంపశయ్య’, ‘ప్రజాకవి కాళోజీ’ వంటి చిత్రాలు తీశారు ప్రభాకర్.

”పైపైన అందరూ విమర్శించినా… నూనూగు మీసమొచ్చిన ప్రతీ కుర్రవాడూ, పరికిణీ కట్టే వయసొచ్చిన ప్రతి ఆడపిల్లా, గత నలభై సంవత్సరాలుగా దిండు కింద దాచుకుని చదివిన ఏకైక వారపత్రిక స్వాతి. నవరసాల సాహిత్యంతో ప్రతీ ఒక్కరినీ అలరింప చేసిన సాహితీ సమరాంగణా సార్వభౌముడు బలరామ్ గారు,” అన్నారు ప్రభాకర్.

“వేమూరి బలరాం గారు యవ్వనంలో ఉన్నప్పుడు, మధ్య వయసులో ఉన్నప్పుడున్న పోలికలు కలిగిన నటుల కోసం వెతుకుతున్నాం. కొంత మంది వచ్చారు. వారి నుండి ఫైనలైజ్ చేయాలి. ఔత్సాహిక నటులు తమ ప్రొఫైల్స్, ఆడిషన్ వీడియోస్  [email protected] మెయిల్ ఐడీకి పంపగలరు” అని అంటున్నారు ప్రభాకర్.

Advertisement
 

More

Related Stories