నీ పని నువ్వు చేస్కో: ప్రభాస్

Prabhas


దర్శకుడు మారుతికి గొప్ప రిలీఫ్. ‘పక్కా కమర్షియల్’ సినిమా దారుణంగా పరాజయం చెందడంతో ఇక అతనికి మరో పెద్ద హీరో ఆఫర్ ఇవ్వకపోవచ్చు అనుకున్నారు జనం. ప్రభాస్ తో తీద్దామనుకున్న ‘రాజా డీలక్స్’ అనే సినిమా కూడా ఆగిపోయిందనే టాక్ నడిచింది. ప్రభాస్ అభిమానులు కూడా “మారుతితో సినిమా వద్దు” అని సోషల్ మీడియాలో ట్రెండింగ్ నడిపారు.

ఈ నేపథ్యంలో ఇటీవల ప్రభాస్ ని మరోసారి కలిశారు మారుతి. “బయటి మాటలు పట్టించుకోకు. నీ పని చేస్కో,” అని ప్రభాస్ మారుతికి చెప్పారట. అంటే, స్క్రిప్ట్ పని పూర్తి చేసుకోమని చెప్పారన్నమాట.

ప్రభాస్ పెద్ద సినిమాలు చేస్తున్నారు. ‘సలార్’, ‘ఆదిపురుష్’, ‘ప్రాజెక్ట్ కే’ వంటి భారీ సినిమాల మధ్య ఒక సింపుల్ గా ఉండే కలర్ ఫుల్ ఎంటర్ టైనర్ చేద్దామని అనుకుంటున్నారట. అందుకే, మారుతికి అవకాశం ఇస్తున్నారు ప్రభాస్. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు, కామెడీ, ఐటెం సాంగ్, ఇంట్రో పాట… ఇలా హడావిడి ఉంటుందట. పైగా భారీ సెట్లు, ఛేజులు, గ్రాఫిక్స్… ఈ గోల ఉండదు. సింపుల్ గా సినిమాని కానిచ్చేయ్యచ్చు.

ఈ ఆలోచనతోనే మారుతికి అవకాశం ఇస్తున్నారట. అందుకే, అతని ట్రాక్ ఈ మధ్య కొంత గతి తప్పినా మారుతికి అవకాశం ఇస్తున్నారు ప్రభాస్.

 

More

Related Stories