ప్రభాస్ అనేక చిత్రాలు ఒప్పుకున్నారు. ఇప్పటికే రెండు సినిమాలు సెట్ పై ఉండగా, మరో రెండు మొదలు కానున్నాయి. కొత్తగా స్టార్ట్ అయ్యే ఒక చిత్రంలో ప్రభాస్ సరసన మృణాల్ నటించే అవకాశం ఉన్నది అని తెలుగుసినిమా.కామ్ ఇంతకుముందే తెలిపింది.
ఆమె తెలుగులో “సీతారామం” చిత్రంతో అడుగుపెట్టింది. ఆ చిత్రానికి దర్శకుడు హను రాఘవపూడి. ఇదే దర్శకుడు ఇప్పుడు ప్రభాస్ తో కొత్త సినిమా తీయనున్నారు. దాంతో, ఆయన తనకి కలిసొచ్చిన హీరోయిన్ ప్రభాస్ సరసన తీసుకోవాలని భావిస్తున్నారట.
అంతేకాదు, మృణాల్ ఠాకూర్ ఈ సినిమా సైన్ చేసిందని తాజా టాక్.