పవన్, ప్రభాస్… సేమ్ టు సేమ్

ఒకప్పుడు వీళ్ల నుంచి రెండేళ్లకు ఓ సినిమా రావడం కష్టంగా ఉండేది. అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా రూటు మార్చేశారు. టాప్ గేర్ లోకి వచ్చేశారు. స్పీడ్ పెంచేశారు. ప్రస్తుతం స్టార్ హీరోల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఎనౌన్స్ చేస్తోంది వీళ్లిద్దరు మాత్రమే. మరీ ముఖ్యంగా ఈ ఇద్దరు స్టార్స్ చేతిలో చెరో 4 సినిమాలున్నాయి.

ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ మూవీ చేస్తున్నాడు పవన్. ఈ మూవీ ఫైనల్ షెడ్యూల్ కంప్లీట్ అయిన వెంటనే క్రిష్ దర్శకత్వంలో సినిమాకు షిఫ్ట్ అవుతాడు. అదే టైమ్ లో హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేశాడు. ఈ 3 కమిట్ మెంట్స్ పూర్తయిన తర్వాత రామ్ తళ్లూరి నిర్మాణంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ ఓ సినిమా చేసే ఛాన్స్ ఉంది.

ఇటు ప్రభాస్ చేతిలో కూడా 4 సినిమాలున్నాయి. ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ సినిమా చేస్తున్నాడు. ఇది పూర్తయిన వెంటనే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్-ఫిక్షన్ సినిమా స్టార్ట్ చేస్తాడు. దీంతోపాటు సైమల్టేనియస్ గా ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ 3 సినిమాలతో పాటు త్వరలోనే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో మరో భారీ బడ్జెట్ మూవీ ప్రకటించే ఆలోచనలో ఉన్నాడు ప్రభాస్.

ఇలా టాలీవుడ్ నుంచి ప్రభాస్-పవన్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నారు.

Related Stories