ప్రభాస్ కి వాయిదాల గండం

Prabhas

రెబెల్ స్టార్ ప్రభాస్ చేసేవన్నీ భారీ చిత్రాలే. అన్నీ పాన్ ఇండియా మూవీస్. వాటి అన్నింటికీ విజువల్ ఎఫెక్ట్స్ అవసరం. అందుకే ఆయన ప్రతి సినిమా అనేకసార్లు వాయిదా పడుతోంది. “బాహుబలి”, “సాహో”, “ఆదిపురుష్”, “రాధేశ్యామ్”, “సలార్”… ఈ సినిమాల్లో ఒక్కటి కూడా మొదటి చెప్పిన డేట్ కి గానీ, ఆ తర్వాత వాయిదా వేసిన డేట్ కి కానీ విడుదల కాలేదు.

ఇవన్నీ కనీసం మూడుసార్లు వాయిదా పడ్డాయి. “కల్కి 2898 AD” ఇప్పటికే రెండుసార్లు వాయిదాపడి మే 9, 2024ని ఫిక్స్ చేసుకొంది. ఈ డేట్ ని ఎట్టి పరిస్థితుల్లో మారదు అని ఇటీవలే అమితాబ్ బచ్చన్ సహా ఆ టీం మొత్తం చెప్పింది.

వాళ్ళు నిజంగానే ఈ డేట్ కి “కల్కి”ని విడుదల చెయ్యాలనుకున్న మాట వాస్తవం. కానీ అనుకోకుండా లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు వచ్చి పడ్డాయి.

ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో వాయిదా వెయ్యాల్సి వస్తోంది. వారి ప్రమేయం లేకుండా వాయిదా పడనుంది. చూస్తుంటే ప్రభాస్ కి “వాయిదాల గండం” ఉన్నట్లుంది. ఐతే ప్రభాస్ అభిమానులు కూడా తమ హీరో సినిమా అంటే చెప్పిన డేట్ కి రాదు అని ముందే ఫిక్స్ అయిపోయారు. ఎప్పుడు వచ్చినా బెస్ట్ క్వాలిటీతో వస్తే చాలు అనేది వారి ఫీలింగ్. ఇటీవల విడుదలైన “సలార్” ఫలితం వారికి ఆనందాన్ని ఇచ్చింది. ఆ సినిమా కూడా చాలా లేట్ గా విడుదలైంది. కానీ అందులో ప్రభాస్ ని చూపించిన విధానం, ఆ మాస్ ఎలివేషన్స్ ఫ్యాన్స్ కి బాగా నచ్చాయి.

Advertisement
 

More

Related Stories