వాళ్ళకి ఆమె తెగ నచ్చేసింది

ప్రభాస్ అభిమానులకు కోపం వచ్చినా, సంతోషం వచ్చినా తట్టుకోవడం కష్టం. వాళ్ళ ప్రేమకు ప్రభాస్ బానిస, వాళ్ళ కోపానికి నిర్మాత బాధితులు. ఏదైతేనేం ఇప్పుడు వీళ్లకు ఓ అందాల భామ తెగ నచ్చింది. దాంతో, ఆమె పేరు ఒక రోజంతా ట్విట్టర్ లో ట్రెండింగ్ కొచ్చింది. ఆమె ఎవరో కాదు … కృతి సనన్.

కృతి సనన్ తాజాగా కరణ్ జోహార్ టాక్ షోలో పాల్గొంది. ఆ షోలో ఒక ఆట ఆడింది. అందులో భాగంగా ఆమె ప్రభాస్ కి అక్కడినుంచి ఫోన్ చేసి మాట్లాడింది. తాను ఎలా చెప్తే అలా చెప్పాలని ఆమె కోరితే అదే చెప్పాడు ప్రభాస్ ఫోన్లో. దాంతో, ఆమె ప్రభాస్ ని తెగ పొగిడింది. మీరు అమేజింగ్ పర్సన్ అని కృత్ ప్రభాస్ కి కాంప్లిమెంట్ గా చెప్పింది. ఆమె అలా పొగడడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఉప్పొంగిపోయారు.

కృతిని పొగుడుతూ ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేశారు. అట్లుటుంది వీళ్ళతో.

ప్రభాస్, కృతి సనన్ కలిసి ‘ఆదిపురుష్’ సినిమాలో నటించారు. ఈ సినిమా వచ్చే జనవరిలో విడుదల కానుంది.

 

More

Related Stories