ఆ మూడింటికి ఇలా ఫిక్స్

Salaar

ప్రభాస్ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో ఒకటి షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొంది. రెండు షూటింగ్ దశలో ఉన్నాయి. నాలుగోది ఇంకా మొదలు కాలేదు. ఈ నాలుగింటిలో మూడింటికి రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేశాడు ప్రభాస్.

1. రాధేశ్యామ్ … జులై 30, 2021
ప్రభాస్, పూజ హెగ్డే జంటగా రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకొంది. ఇప్పటికే టీజర్ విడుదలైంది. రాధాకృష్ణ కుమార్ దర్శకుడు. ఈ ఏడాది ప్రభాస్ నుంచి వస్తున్న మూవీ ఇదొక్కటే.

2. సలార్… ఏప్రిల్ 14, 2022
ప్రభాస్, శృతి జంటగా నటిస్తున్నారు. షూటింగ్ జరుగుతోంది. ప్రశాంత్ నీల్ తీస్తున్న గ్యాంగ్ స్టర్ మూవీ ఇది. ‘కేజేఎఫ్’ దర్శకుడు తీస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి.

3. ఆదిపురుష్… ఆగస్టు 11, 2022
‘సలార్’ విడుదలైన నాలుగు నెలలకే వస్తున్న మూవీ… ఆదిపురుష్. ఈ సినిమా షూటింగ్ కూడా ముంబైలో జరుగుతోంది. ఇందులో ప్రభాస్ రాముడిగా నటిస్తాడు. ప్రభాస్ ఇంకా షూటింగ్ లో జాయిన్ అవలేదు. ప్రభాస్ అవసరం లేని ఇతర సీన్లు చిత్రీకరిస్తున్నారు.

ఇలా మూడు సినిమాలకు విడుదల తేదీలు ఖరారు కావడంతో నాగ్ అశ్విన్ తీసే సైన్స్ ఫిక్షన్ గురించి మాట్లాడుకోవడం మానేశారు ప్రభాస్ అభిమానులు. ఈ మూడు విడుదలైన తర్వాత దాని గురించి డిస్కషన్ ఉంటుంది.

More

Related Stories