‘నేనంటే ప్రభాస్ కి క్రష్’

Bhagyashree

ప్రభాస్ అంటే కోట్లాదిమంది అమ్మాయిలకు పిచ్చి. మరి ప్రభాస్ కి టీనేజ్ లో ఏ భామ అంటే పిచ్చి? దానికి సంధానం దొరికొంది.

“నా పైన చాలా క్రష్ ఉండేదిట. నా ఫొటోస్ కలెక్ట్ చేసెవాడు అని ప్రభాస్ చెప్పాడు. అంతగా నా పై క్రాష్ ఉండేదని చెప్పడం నాకు హ్యాపీగా అనిపించింది,” అని తెలిపింది 50 ప్లస్ భాగ్యశ్రీ. ప్రభాస్ నటిస్తున్న “రాధే శ్యామ్” సినిమాలో ఆమె తల్లి పాత్ర పోషిస్తోంది. పూజ హెగ్డేకి తల్లిగానా, ప్రభాస్ కా అన్నది చూడాలి.

“ప్రభాస్ జెంటిల్ మాన్. నేను బాహుబలి చూసి …. అతను చాలా అగ్రెసివ్ గా ఉంటాడు అనుకున్నా. కానీ రియల్ లైఫ్ లో చాలా సాఫ్ట్. మంచి మనిషి. సెట్ లో అందర్నీ గౌరవిస్తాడు,” ఇలా ప్రభాస్ గురించి గొప్పగా చెప్పింది.

“మైనే ప్యార్ కియా” సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన నటించి దేశమంతా పాపులర్ అయింది. అప్పట్లో కుర్రాళ్లందరికి ఆమె అంటే అదన్నమాట. ఇప్పుడు ఆమెకి 51 ఏళ్ళు. ఐతే, ఫిజిక్ మాత్రం చాలా గొప్పగా మైంటైన్ చేస్తోంది. అంత వయసు అనిపించదు ఆమె ఫేస్ చూస్తే.

Related Stories