ప్రభాస్ తో ఎలాగైనా సెట్ చెయ్యాలి

Prabhas

మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఒక్కసారిగా టాలీవుడ్ లో లీడింగ్ నిర్మాణ సంస్థగా మారింది. అల్లు అర్జున్ (పుష్ప), మహేష్ బాబు (సర్కారు వారి పాట) సినిమాలు సెట్స్ పై ఉన్నాయ్. పవన్ కళ్యాణ్ (హరీష్ శంకర్ డైరెక్షన్లో), చిరంజీవి (బాబీ డైరెక్షన్లో), బాలకృష్ణ (గోపీచంద్ మలినేని డైరెక్షన్లో) చిత్రాలు త్వరలోనే మొదలవుతాయి. ఎన్టీఆర్, విజయ్ దేవరకొండతో కమిట్ మెంట్స్ ఉన్నాయి. ఇలా పెద్ద స్టార్స్ తో సినిమాలు తీస్తున్నా… ప్రభాస్ తో సినిమా సెట్ కాకపోవడం ఆ సంస్థకి వెలితిగా ఉంది.

ప్రభాస్ తో ఎలాగైనా సినిమా చెయ్యాలని రెండేళ్లుగా ప్రయత్నిస్తోంది. “కెజిఎఫ్” దర్శకుడితో సినిమాని ఫిక్స్ చెయ్యాలని చాలా ట్రై చేశారు. ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్ లో ‘సలార్’ అనే సినిమా సెట్ అయితే అయింది కానీ దాని నిర్మాణం మైత్రికి దక్కలేదు. “కెజిఎఫ్” నిర్మాతలైన కన్నడ ప్రొడ్యూసర్స్ కే చేస్తున్నాడు ప్రభాస్.

అందుకే, ఇప్పుడు మైత్రికి బడా దర్శకుడు కావాలి.

మంచి డైరెక్టర్, మంచి కథ తీసుకురండి అని ప్రభాస్ మాట ఇవ్వడం, అడ్వాన్స్ కూడా తీసుకోవడంతో ఇప్పుడు మైత్రి అదే పనిలో ఉంది. ప్రభాస్ ఈ ఏడాది ‘ఆదిపురుష్’, ‘సలార్’ సినిమా షూటింగ్ లు పూర్తి చేస్తాడు. అలాగే, ఈ ఏడాదే నాగ్ అశ్విన్ తీసే సైన్స్ ఫిక్షన్ సెట్ పైకి తీసుకెళ్తాడు. అది వచ్చే ఏడాది పూర్తి అవుతుంది. నెక్స్ట్ ఇయర్ మరో సినిమాని లాంచ్ చేసేందుకు ప్రభాస్ రెడీ. దాని కోసమే, మైత్రి వాళ్ళు కిందా మీద పడుతున్నారట.

More

Related Stories