అది సైడ్ కి వెళ్లేలా సక్సెస్!

- Advertisement -
Prabhas


ప్రభాస్ కి చాలా సిగ్గు ఎక్కువ. మీడియా ఇంటర్వ్యూలలో కూడా చిన్న చిన్న జవాబులు ఇస్తుంటారు. హీరోగా తెరపై విజృంభిస్తుంటారు. కానీ నిజజీవితంలో చాలా సాఫ్ట్. ఐతే, ప్రభాస్ కూడా ఇప్పుడు మీడియాతో ఎలా మెలగాలో తెలుసుకున్నట్లు ఉన్నారు.

ప్రభాస్ కి, పూజ హెగ్డేకి ‘రాధేశ్యామ్’ షూటింగ్ సమయంలో గొడవ జరిగిందని, కొన్నాళ్లుగా వారి మధ్య మాటల్లేవు, మాట్లాడుకోవడాలు లేవు అని మీడియాలో ప్రచారం జరిగింది. దానికి తగ్గట్లే, ఈ సినిమా ప్రమోషన్స్ లో మొదట ఇద్దరూ ముభావంగా ప్రవర్తించారు. వారి మధ్య గొడవ గురించి రెండు, మూడు సార్లు జర్నలిస్టులు అడగ్గానే ప్రభాస్ అలెర్ట్ అయ్యారు. ఆ ప్రశ్న మరోసారి తలెత్తకుండా తన ఇంటర్వ్యూల పద్దతి మార్చేశారు.

ఒక సినిమా ప్రొమోషన్ సమయంలో గతంలో తాను మిగతా హీరోయిన్లలతో ఎలా ఫ్రెండ్లీగా ఉంటూ ఇంటర్వ్యూలు ఇచ్చేవారో అలా ఇస్తున్నారు ప్రభాస్. దాంతో, రెండ్రోజుల్లో మేటర్ సర్దుకొంది.

తమ మధ్య ‘గ్యాప్’ ఉంది అన్న విషయం ‘రాధేశ్యామ్’ సినిమా ప్రొమోషన్ ని డామినేట్ చెయ్యకుండా సక్సెస్ అయ్యారు ప్రభాస్. ఇప్పుడు ఆ మేటర్ సైడ్ అయిపొయింది.

 

More

Related Stories