ప్రభాస్ ర్యాగింగ్ చేశాడట

Radhe Shyam

ప్రభాస్ తనను ర్యాగింగ్ చేశాడని కంప్లయింట్ చేస్తోంది పూజా హెగ్డే. అయితే ఇదేదో కాస్టింగ్ కౌచ్ ఆరోపణ లాంటిది మాత్రం కాదు. పూజా హెగ్డే సరదాగా చెప్పిన మాట ఇది.. ఇటలీలో ‘రాధేశ్యామ్’ షూటింగ్ పూర్తిచేసుకొని ఇండియా వచ్చిన పూజా హెగ్డే, షూటింగ్ విశేషాల్ని చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా ప్రభాస్ తో తనకున్న బాండింగ్ ను బయటపెట్టింది.

ప్రభాస్ కు కాస్త సిగ్గు ఎక్కువ అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ అది సెట్స్ పైకి వచ్చేంత వరకు మాత్రమే అంటోంది పూజా హెగ్డే. సెట్స్ పై ప్రభాస్ చాలా జోష్ గా ఉంటాడని, అతడితో వర్క్ చేయడం చాలా కంఫర్ట్ గా ఉంటుందని చెబుతోంది. పైగా తామిద్దరం కలిసి చేస్తోంది ఓ ప్రేమకథలో కాబట్టి, మా మధ్య కెమిస్ట్రీ ఇంకాస్త ఎక్కువగా కుదిరిందని అంటోంది.

తామిద్దరం బాగా క్లోజ్ అయిపోవడంతో ఒక దశలో ప్రభాస్ తనను ర్యాగింగ్ కూడా చేశాడని గుర్తుచేసింది పూజా హెగ్డే. తన దృష్టిలో ప్రభాస్ ఎప్పుడూ నాటీ అంటోంది ఈ బుట్టబొమ్మ.

Related Stories