
గోపీచంద్, సంపత్ నంది కాంబినేషన్‌లో రూపొందిన మూవీ… ‘సీటీమార్’. గోపిచంద్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్‌తో శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. తమన్న హీరోయిన్‌గా నటించింది. చాలా గ్యాప్ తర్వాత థియేటర్లలోకి మాస్ సినిమా వస్తోంది. దాంతో, అంచనాలు భారీగా ఉన్నాయి.
ఈ సినిమా ట్రైలర్ చూసిన ప్రభాస్ గోపీచంద్ కి ఫోన్ చేసి అభినందించారట. ట్రైలర్ బాగా నచ్చింది అని చెప్పారట ప్రభాస్. ‘‘మా సినిమా ట్రైలర్ చూసి విషెష్ చెప్పిన మెగాస్టార్ గారికి థాంక్స్. అలాగే నా స్నేహితుడు ప్రభాస్ కూడా ట్రైలర్ చూసి స్పెషల్‌గా ఫోన్ చేసి మాట్లాడాడు. తనకు కూడా థాంక్స్,” అని గోపీచంద్ అన్నారు.
కోవిడ్ పరిస్థితులను తట్టుకొని నిలబడ్డ తన నిర్మాతలను మెచ్చుకున్నారు గోపీచంద్.
“గత నెలన్నరగా పరిస్థితులు బెటర్ అవుతున్నాయి. అందరూ బయటకు వస్తున్నారు. సినిమాలు విడుదలవుతున్నాయి. ఇప్పుడు సీటీమార్ వంటి పక్కా మాస్ కమర్షియల్ సినిమా వస్తుంది. ప్రేక్షకులను ఇంటి నుంచి థియేటర్స్‌కు తీసుకొచ్చే సత్తా ఉన్న సినిమా అనే నమ్మకం ఉంది. ఈ సినిమాను ఆదరిస్తే, మిమ్మల్ని అలరించడానికి చాలా చాలా సినిమాలు రెడీగా ఉన్నాయి. మా నిర్మాత శ్రీనివాసా చిట్టూరి అండ్ టీమ్ ఎక్కువ బడ్జెట్ అవుతుందని నేను చెబితే, కథ నచ్చిందండి చెప్పి సినిమా స్టార్ట్ చేశారు. ఆరోజు నుంచి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను చాలా గొప్పగా తెరకెక్కించిన నిర్మాతలు శ్రీనుగారు, పవన్‌గారికి థాంక్స్. “
“ఇది థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేసే సినిమా… తప్పకుండా థియేటర్స్‌కు వచ్చి సినిమా చూడండి. ఎంజాయ్ చేసి ఇంటికెళతారు. అందులో డౌట్ లేదు’’ అన్నారు గోపీచంద్.