
ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఒకేసారి మూడు సినిమాలను సెట్స్ పై ఉంచి… ఇంకా మూడు సినిమాల గురించి డిస్కషన్స్ మొదలు పెట్టారు. ఐతే, తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో ప్రభాస్ మూవీ ఓకె అయిందని, త్వరలోనే సెట్స్ పైకి వెళ్తుందని ఇటీవల వార్తలు జోరుగా షికారు చేశాయి.
లోకేష్ కనగరాజ్ ఇప్పుడు హాట్ షాట్ డైరెక్టర్. కార్తితో “ఖైది”, విజయ్ తో “మాస్టర్”, కమల్ హాసన్ తో “విక్రమ్” సినిమాలు తీసిన లోకేష్ ఇప్పుడు విజయ్ హీరోగా “లియో” సినిమా పూర్తి చేశాడు. ఆ తర్వాత ఏమి సినిమా చేస్తాడు అనే విషయంలో రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. కానీ, ప్రభాస్ తో వెంటనే సినిమా మొదలు పెడుతాడు అన్న విషయం అబద్దమని తేలింది.
రజినీకాంత్ తో లోకేష్ సినిమా స్టార్ట్ చెయ్యనున్నారు. మార్చిలో షూటింగ్ మొదలవుతుంది. ఈ లోపు స్క్రిప్ట్ పూర్తి చేసి, ప్రీ ప్రొడక్షన్ మొదలు పెడతారట. ఆ తర్వాత “ఖైదీ 2” స్టార్ట్ అవుతుంది. ఈ రెండూ పూర్తి అయ్యేసరికి 2025 అవుతుంది. ఆ తర్వాత ప్రభాస్ తో సినిమా ఉండొచ్చు. అప్పటికి ప్రభాస్ వేరే సినిమాలు చెయ్యకుండా ఉండాలి.
సో, ప్రభాస్ – లోకేష్ సినిమా ఇప్పట్లో లేదు.
సడెన్ గా వీరి సినిమా గురించి వార్తలు రావడానికి కారణం ప్రభాస్ – బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ సినిమా ఆగిపోవడమే. “ఆదిపురుష్” అట్టర్ ఫ్లాప్ తర్వాత ప్రభాస్ కొన్నాళ్ళూ హిందీ సినిమాల జోలికి వెళ్లోద్దని అనుకున్నాడట. అలా.. సిద్ధార్థ్ ఆనంద్ సినిమా అటకెక్కింది. దానికితోడు, సిద్ధార్థ్ ఆనంద్ కూడా మైత్రి మూవీ మేకర్స్ సంస్థతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపడం లేదు.
దాంతో, ఆ సినిమా స్థానంలో లోకేష్ ని తీసుకొచ్చి ప్రభాస్ తో మూవీ చెయ్యాలని మైత్రి మూవీ మేకర్స్ ప్రయత్నిస్తోంది. కానీ ఇది కార్యరూపం దాల్చాలంటే చాలా కాలం పడుతుంది.
ప్రభాస్, లోకేష్ కనగరాజ్, ప్రభాస్ మూవీస్, లోకేష్ కనగరాజ్,