
హీరో ప్రభాస్ నటించిన “సలార్” ట్రైలర్ నిన్న విడుదలైంది. అందరూ మెచ్చుకుంటున్నది ప్రభాస్ ఫిజిక్, లుక్. చాలా రోజుల తర్వాత ప్రభాస్ పక్కా మాస్ హీరో లుక్ లో కన్పించాడు. ట్రైలర్ లో విజువల్స్ అవీ అన్నీ బాగానే ఉన్నా ఎక్కువ హైలైట్ అయింది మాత్రం ప్రభాస్ సాలిడ్ కటౌట్.
దర్శకుడు ప్రశాంత్ నీల్ హీరో యష్ నే అద్భుతంగా చూపించాడు. మరి ప్రభాస్ కటౌట్ కి నీల్ టేకింగ్ తోడు అయితే బాక్సాఫీస్ సునామీ ఉంటుంది అని ఫ్యాన్స్ ఇప్పటివరకు అంచనా వేస్తూ వచ్చారు. వారి కలలకు దగ్గట్లే ప్రశాంత్ నీల్ ప్రభాస్ ని సూపర్ గా చూపిస్తున్నట్లు అర్థమవుతోంది ఈ ట్రైలర్ తో.
ప్రశాంత్ నీల్ మొదటి చిత్రం… ఉగ్రం. అది కన్నడనాట పెద్ద హిట్. ఆ తర్వాత తీసిన చిత్రాలు “కేజీఎఫ్” మూవీస్. ఇది నాలుగో చిత్రం. ఈ సినిమా సెటప్ అంతా “కేజీఎఫ్”నే తలపిస్తున్న మాట వాస్తవమే హీరో ఒక్కడే ఒక పెద్ద ఆర్మీ అన్న బిల్డప్ మాత్రం అదిరింది.
ALSO READ: Salaar CeaseFire Trailer: Prabhas spits fire!
ట్రైలర్ ఉన్నట్లు సినిమా ఉంటే బాక్సాఫీస్ వద్ద సంచలనాలు నమోదు అవుతాయి. కాకపోతే హిందీ మార్కెట్ లో షారుక్ నుంచి గట్టి పోటీ ఉంటుంది. అది క్లాస్ మూవీ, ఇది మాస్ మూవీ. సో, ఇండియన్ డొమెస్టిక్ మార్కెట్ లో “సలార్”కే ఎడ్జ్ ఉంటుంది అని ఈ ట్రైలర్ తో చెప్పొచ్చు.