‘కల్కి’ సెట్లో ప్రభాస్

Kalki 2898AD

ప్రభాస్ మొత్తానికి షూటింగ్ సెట్లోకి వచ్చాడు. దాదాపు మూడు నెలల తర్వాత షూటింగ్ లొకేషన్ లోకి అడుగుపెట్టారు. ఇటీవల ప్రభాస్ మోకాలికి శస్త్ర చికిత్స జరిగింది. దాంతో దాదాపు మూడు నెలలు షూటింగ్ దూరంగా ఉన్నారు.

తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్ తీస్తున్న “కల్కి 2898AD ” షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ సెట్ కి నెట్ ఫ్లిక్స్ సిఇఓ, ఆయన బృందం వచ్చి ప్రభాస్ ని కలిసింది. ఆ ఫోటోలను నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

సర్జరీ తర్వాత ప్రభాస్ కెమెరా కంటికి చిక్కిన అధికారిక ఫోటో ఇదే.

ప్రభాస్ నటించిన “సలార్” ఈ నెల 22న విడుదల కానుంది. దీని ప్రమోషన్ లలో ప్రభాస్ పాల్గొంటారు.

Advertisement
 

More

Related Stories