అవుట్ ఫుట్ అదిరేలా హుకుం

Prabhas


“ఆదిపురుష్” సినిమాకి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోంది. “టీజర్” విడుదలైన తర్వాత వచ్చిన విమర్శలను దృష్టిలో పెట్టుకొని ఆరు నెలల టైంఫ్రేమ్ తో ఇటీవల పనులు మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ పనులు జోరుగా సాగుతున్నాయి.

“ఆదిపురుష్” గ్రాఫిక్స్ వంక పెట్టకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు దర్శకుడు ఓం రౌత్. “మేం సరికొత్త టెక్నాలజీ వాడి సినిమాని చిత్రీకరించాం. గ్రాఫిక్స్ కూడా అదిరిపోతాయి. టీజర్ కి వచ్చిన విమర్శలు ఎలా ఉన్నా… సినిమా అవుట్ ఫుట్ అందరి నోళ్లు మూయిస్తుంది. ఇది నా గ్యారెంటీ,” అని ఈ దర్శకుడు తాజా ఇంటర్వ్యూలో తెలిపాడు.

ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ జానకిగా నటిస్తున్న ఈ రామాయణ గాథ వచ్చే జూన్ లో విడుదల కానుంది.

ప్రభాస్ ప్రత్యేక శ్రద్ద చూపి టీం వెంటపడుతున్నారు. గ్రాఫిక్స్ బాగా వచ్చేంతవరకు చెయ్యాల్సిందే అనేది ప్రభాస్ హుకుం.

 

More

Related Stories