కెమిస్ట్రీ వర్కవుట్ అయితేనే!

Radhe Shyam


ప్రభాస్ కి ఇప్పుడు జాతీయస్థాయిలో క్రేజుంది. అందులో డౌటే లేదు. సినిమా జాన్రాతో సంబంధం లేకుండా ఆయన సినిమా విడుదల అవుతుంది అంటే… ఓపెనింగ్స్ అదిరిపోతాయి. జనవరి 14న విడుదల కానున్న ‘రాధేశ్యామ్’ కూడా తెలుగునాట, హిందీ రాష్ట్రాల్లో టెర్రిఫిక్ ఓపెనింగ్స్ సాధిస్తుంది అని చెప్పొచ్చు.

ఐతే, నాలుగేళ్లుగా నిర్మాణం జరుపుకున్న ‘రాధేశ్యామ్’ బ్లాక్ బస్టర్ కావాలంటే… ప్రభాస్, పూజ హెగ్డే మధ్య కెమిస్ట్రీ బాగుంది అని ప్రేక్షకులకు కలగాలి. యాక్షన్ సినిమాలకు, మాస్ సినిమాలకు ప్రభాస్ స్టార్ పవర్, అతని యాక్టింగ్, చరిష్మా సరిపోతుంది. కానీ ఇది పీరియడ్ లవ్ స్టోరీ. ప్రేమకథా చిత్రంలో కెమిస్ట్రీ ముఖ్యం.

టీనేజ్ ప్రేమకథలు, 20 ప్లస్ స్టార్స్ మధ్య సాగే లవ్ స్టోరీస్ కి పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ 40 ప్లస్ లో ఉన్న ప్రభాస్, 30లలో ఉన్న పూజ హెగ్డే మధ్య లవ్ స్టోరీ అంటే కెమిస్ట్రీ చాలా బాగా కుదిరాలి.

ప్రభాస్, పూజ హెగ్డే మధ్య కెమిస్ట్రీ ఈ సినిమా జాతకాన్ని నిర్ణయిస్తుంది. గ్రాఫిక్స్ మాయాజాలం ఎంత చేసినా… వారి ముఖాల్లో, బాడీ లాంగ్వేజ్ లో మాత్రం ‘అది ఇది’ ఉండాలి. దర్శకుడు రాధాకృష్ణ కుమార్ తీస్తున్న ఈ సినిమాకి జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందించాడు.

 

More

Related Stories