ప్రభాస్ ప్రూవ్ చేసుకున్నారు కానీ

Prabhas

ప్రభాస్ స్టేమినా ఏంటో మరోసారి అందరికీ అర్థమైంది. ఆయనకి ఇండియా అంతా క్రేజ్ ఉంది. చాలామంది తమకు పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ ఉందని చెప్పుకుంటున్నారు. కానీ ప్రభాస్ మాత్రమే వరుస సినిమాలతో తన సత్తా ఏంటో నిరూపించారు. ‘బాహుబలి 2’ తర్వాత ప్రభాస్ మూడు సినిమాలు విడుదల చేస్తే అందులో రెండు సినిమాలు హిందీ మార్కెట్ లో 100 కోట్లపైగా వసూళ్లు అందుకున్నాయి.

ఏ హీరో స్టార్డం అయినా ఓపెనింగ్ కలెక్షన్లపైనే ఆధారపడి ఉంటుంది. ఆ లెక్కన హిందీ మార్కెట్ లో ఓపెనింగ్ తెచ్చే నిజమైన దక్షిణాది పాన్ ఇండియా హీరోగా ప్రభాస్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నట్లే.

ఐతే, ప్రభాస్ సినిమాలకు భారీ ఓపెనింగ్ వస్తోంది. కానీ అవి పూర్తిగా లాభాలు తెచ్చిపెట్టడం లేదు. దానికి కారణం, ‘బాహుబలి 2’ తర్వాత వచ్చిన ఏ సినిమా కూడా ఏకపక్షంగా సూపర్ టాక్ తెచ్చుకోలేదు. పూర్ రేటింగ్, ట్రోలింగ్ ఎక్కువ. అందుకే, ప్రభాస్ ఇప్పుడు ‘కంటెంట్’ పరంగా బలంగా ఉండే సినిమాలు చెయ్యాలి.

ఐతే, ‘సలార్’ సినిమాతో ఆ లోటు తీరుతుందని భావిస్తున్నారు. ‘సలార్’ ఈ ఏడాది సెప్టెంబర్ 28న విడుదల కానుంది.

 

More

Related Stories