ప్రభాస్ పెడుతున్న కండీషన్లు ఇవే!

Prabhas

“సాహో”, “రాధే శ్యామ్” సినిమాల నుంచి నేర్చుకున్న పాఠం అది. ఇక నుంచి ఇలాంటి మాస్ సినిమాలకు మూడు నెలలకు మించి తన డేట్స్ ఇవ్వొద్దు అనుకుంటున్నాడు ప్రభాస్. తనకు సంబంధించిన భాగం అంతా 60 వర్కింగ్ డేస్ లో పూర్తి చెయ్యాలి. సినిమా మొత్తం ఆరు నెలల్లో పూర్తి కావాలి. ఇది ప్రభాస్ దర్శకులకు పెడుతున్న కండీషన్.

అందుకే, ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ‘సలార్’ సినిమా షూటింగ్ స్పీడ్ గా సాగుతోంది. ఏప్రిల్, మే నాటికి గుమ్మడికాయ కొట్టేలా ప్రశాంత్ నీల్ వర్క్ చేస్తున్నాడు.

‘ఆదిపురుష్’ దర్శకుడు కూడా ప్రభాస్ లేకుండానే సినిమా షూటింగ్ జరిపిస్తున్నాడు. అంటే, అటు ”రాధేశ్యామ్’, ఇటు ‘సలార్’ రెండూ షూటింగ్ జరుపుకుంటున్నాయి.

More

Related Stories