సల్మాన్ తర్వాతే ప్రభాస్ పెళ్లి

Prabhas


ప్రభాస్ పెళ్లి లొల్లి ఇంకా తగ్గలేదు. అభిమానులు అయినా, జర్నలిస్టులు అయినా, టాక్ షో హోస్ట్ చేసే సెలెబ్రిటీలు అయినా… ప్రభాస్ ని తప్పకుండా అడిగే ప్రశ్న… పెళ్లి ఎప్పుడు అని. నందమూరి బాలకృష్ణ కూడా అదే రొటీన్ క్వశ్చన్ అడిగారు.

ఐతే, ప్రభాస్ తెలివిగానే సమాధానం ఇచ్చారు. ‘సల్మాన్ ఖాన్ పెళ్లి తర్వాత నాదే’ అని చెప్పారు.

సల్మాన్ ఖాన్ కి ఇప్పుడు 56. ఈ వయసులో అతని పెళ్లి జరగుతుందని అనుకోలేం. ఇక, ప్రభాస్ ఆల్రెడీ 40 ప్లస్ లో ఉన్నారు. ప్రభాస్ ఇప్పుడే చేసుకుంటే బెటర్. కానీ, ప్రభాస్ ఎందుకో ఆసక్తి చూపడం లేదు.

ఐతే, గతంలో హీరోలకు ఇన్ని రూమర్స్ వచ్చేవి కాదు కానీ తనని ప్రేమ పుకార్లతో ఇబ్బంది పెడుతున్నారని ప్రభాస్ వాపోతున్నారు. ఇటీవలే, బాలీవుడ్ భామ కృతి సనన్ తో ప్రభాస్ కి లింక్ పెడుతూ పుకార్లు షికార్లు చేశాయి. ఇంతకుముందు అనుష్క, ఇప్పుడు కృతి అని టాక్. ప్రభాస్ మాత్రం ఈ విషయంలో సౌండ్ లేదు. ఐతే, ప్రభాస్ తో తన పెళ్లి అన్న వార్తలను కృతి ఇప్పటికే తోసిపుచ్చింది.

Advertisement
 

More

Related Stories