
ఈ నెల 22న విడుదల కానుంది “సలార్”. దాంతో, ప్రభాస్ పెండింగ్ సినిమాల లిస్ట్ ఎండింగ్ కి వచ్చినట్లే. వచ్చే ఏడాది “కల్కి 2898AD”, మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న కొత్త సినిమా విడుదల అవుతాయి. ఈ రెండు సినిమాల షూటింగ్స్ కూడా చివరి దశకు చేరుకున్నట్లే.
సో, ప్రభాస్ ఇప్పుడు మరో రెండు సినిమాలను స్టార్ట్ చెయ్యనున్నాడు. అందులో ఒకటి సందీప్ వంగా తీసే “స్పిరిట్”. ఐతే, “స్పిరిట్” షూటింగ్ మాత్రం 2024 అక్టోబర్లో మొదలవుతుంది.
ముందుగా మొదలయ్యే చిత్రం… దర్శకుడు హను రాఘవపూడి తీసే ప్రేమ, యాక్షన్ మూవీ. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఇప్పటికే హను రాఘవపూడి (‘సీతారామం’) షూటింగ్ లొకేషన్లు వెతికే పనిలో ఉన్నాడు. ఫిబ్రవరి, మార్చిలో షూటింగ్ మొదలుపెట్టి ఏడాది చివరికి ఫినిష్ చేస్తాడు ప్రభాస్.
ఆ తర్వాత “స్పిరిట్” షూటింగ్ మొదలవుతుంది.