రెండు షేడ్స్? రెండు రోల్స్?

Prabhas


ప్రభాస్ ఒక్కసారిగా తగ్గిపోయాడు. మొన్నటి వరకు అతని శరీరాకృతి గురించి విమర్శలు వచ్చాయి. ఇపుడు అందరూ నోరెళ్ళబెడుతున్నారు ప్రభాస్ తగ్గగానే. అవును ప్రభాస్ సన్నబడ్డాడు. ఉన్నట్టుండి ఈ బాహుబలి హీరో ఇలా కిలోల కొద్దీ బరువు తగ్గడంతో రకరకాల కామెంట్స్ వస్తున్నాయి.

అభిమానులు మాత్రం సంతోషంగా ఉన్నారు. “ఇకపై మా హీరో బాడీ గురించి కామెంట్ చేస్తే మామూలుగా ఉండదురోయ్,” అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషంతో ఇతర హీరోల ఫ్యాన్స్ కి వార్నింగ్ ఇస్తున్నారు.

మరికొందరు మాత్రం ప్రభాస్ ఇలా తగ్గింది ‘సలార్’ చిత్రంలో రెండో పాత్ర కోసమే అని అంటున్నారు. ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రభాస్ హీరోగా తీస్తున్న ‘సలార్’ చిత్రంలో రెండు పాత్రలు ఉన్నాయని టాక్ మొదలైంది. ఒక పాత్రలో బల్కిగా, ఇంకో పాత్రలో స్లిమ్ గా కనిపించాలని అందుకే ప్రభాస్ తగ్గాడనేది ప్రచారం. ఈ కొత్త వార్తల గురించి టీం మాత్రం గుంభనంగా ఉంది. ప్రభాస్ ది ఈ సినిమాలో నిజంగా ద్విపాత్రాభినయమా అన్న విషయంలో అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు.

‘సలార్’ వచ్చే ఏడాది విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది.

 

More

Related Stories