ఆ పిల్ల బాత్రూంలో నేనెందుకుంటా?: ప్రభాస్

- Advertisement -
Prabhas Romantic


ప్రభాస్ కి మంచి సెన్సాఫ్ హ్యూమరుంది. లేటెస్ట్ ఇంటర్వ్యూలో ప్రభాస్ వేసిన ఒక జోక్ బాగా వైరల్ అవుతోంది. ఆకాష్ పూరి హీరోగా రూపొందిన ‘రొమాంటిక్’ సినిమా కోసం ప్రభాస్ తన వంతుగా ప్రమోషన్ చేస్తున్నాడు. పూరి జగన్నాధ్ తో ఉన్న అనుబంధం వల్ల ఈ సినిమా కోసం వీడియో ఇంటర్వ్యూ చేశాడు ప్రభాస్.

ఇంటర్వ్యూ మధ్యలో ఆకాష్ తన సినిమా హీరోయిన్ కేటిక శర్మని పాట పాడమని అడిగాడు. ఆ అమ్మాయి సిగ్గూ పడుతూ “నేను బాత్రూం సింగర్ ని మాత్రమే,” అంటూ పాడేందుకు నిరాకరించింది. “ఏమీ కాదు… నువ్వు పాడు..నేను ఇక్కడ లేను అనుకో… ఇది నీ బాత్రూం అనుకో,” అంటూ ఆమెని ఉత్సాహపరిచాడు ఆకాష్ పూరి.

పనిలో పనిగా ప్రభాస్ ని కూడా మీరు ఇక్కడ లేరు అని చెప్పండి అని అడిగాడు ఆకాష్. దానికి ప్రభాస్, “ఆ పిల్ల బాత్రూమ్ లో నేను ఎందుకుంటానురా?” అంటూ సమాధానం ఇచ్చారు. ప్రభాస్ స్పాంటేనియస్ గా ఇచ్చిన రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

Romantic Date with Darling Prabhas | Romantic Releasing on October 29th

ఈ నెల 29న ‘రొమాంటిక్’ మూవీ విడుదల కానుంది. పూరి జగన్నాధ్ స్వయంగా నిర్మించిన మూవీ. ఆకాష్ పూరి ఈ సినిమాపై చాలా ధీమాగా ఉన్నాడు.

More

Related Stories