మూడింటిపై క్లారిటీ వచ్చింది

Prabhas

ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమాలు నాలుగు సెట్స్ పై ఉన్నాయి. మరో రెండు త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నాయి. దాంతో, ఏ సినిమా ఎప్పుడు వస్తుంది అనే విషయంలో చాలా గందరగోళం ఉంది అని నిన్నటి వరకు అభిమానులు అనుకున్నారు. తాజాగా ఇప్పుడు మొత్తం క్లారిటీ వచ్చింది. ఈ రోజు శివరాత్రి సందర్భంగా నిర్మాత అశ్వనీదత్ తాను ప్రభాస్ హీరోగా నిర్మిస్తున్న ‘ప్రాజెక్ట్ కే’ సినిమా విడుదల తేదీ ప్రకటించారు.

దాంతో, మూడు సినిమాల విడుదల తేదీపై క్లారిటీ వచ్చింది. మిగతా మూడు తర్వాత సంగతి.

‘ఆదిపురుష్’ ఈ ఏడాది జూన్ లో విడుదల అవుతుంది. ఇదే ఏడాది ‘సలార్’ కూడా వస్తుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ‘ప్రాజెక్ట్ కే. అంటే ప్రతి మూడు, నాలుగు నెలల గ్యాప్లో ఒక్కోటి ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

  1. ఆదిపురుష్ – జూన్ 16, 2023
  2. సలార్ – సెప్టెంబర్ 28, 2023
  3. ప్రాజెక్ట్ కె – జనవరి 12, 2024

ఇక మారుతి దర్శకత్వంలో ఒక సినిమా షూటింగ్ దశలో ఉంది. మరోటి, సందీప్ వంగా డైరెక్షన్ లో ‘స్పిరిట్’ ఇది వచ్చే ఏడాది మొదలవుతుంది. దీంతో పాటు ‘పఠాన్’ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో కూడా ఒక సినిమా ఉంటుంది.

Advertisement
 

More

Related Stories