
షూటింగులు ఎప్పుడు మొదలు అవుతాయనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఐతే, ప్రభాస్ మాత్రం వచ్చే నెల నుంచే సెట్ కి వచ్చేద్దామనే తొందర్లో ఉన్నాడట. తెలంగాణాలో కేసుల ఉధృతి కొంత తగ్గింది. అలాగే వ్యాక్సినేషన్ డ్రైవ్ మెల్లగా పెరుగుతోంది. ఫైజర్, మెడెర్నా వంటి విదేశీ వ్యాక్సిన్లు కూడా రానున్నాయి. జులై, ఆగస్టు నాటికి పరిస్థితులు కుదుటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
బహుశా ఇందుకే కాబోలు ప్రభాస్ తన సినిమాల షూటింగులపై ఒక నిర్ణయం తీసుకున్నాడట.
ప్రభాస్ ముందుగా “రాధే శ్యామ్” షూటింగ్ పూర్తి చెయ్యాలి. అదే ముందు టార్గెట్. ఈ సినిమాకి సంబంధించి ఒక పాట చిత్రీకరణ మిగిలి ఉంది. అలాగే కొంత ప్యాచ్ వర్క్ కూడా చెయ్యాలి. ఫోకస్ పెట్టి పని చేస్తే 10 రోజుల్లో గుమ్మడికాయ కొట్టొచ్చు. అందుకే, దీని ముందుగా మొదలుపెడుతాడట.
ఆ తర్వాత ప్రభాస్ “సలార్”, “ఆదిపురుష్” సినిమాల షూటింగ్స్ గురించి ఆలోచిస్తాడేమో.
ఇది చదివారా: Will Radhe Shyam agree to a hybrid release offer?