
గత కొంతకాలంగా ప్రభాస్ బయటి ప్రపంచానికి దూరంగా ఉంటున్నారు. షూటింగ్ లొకేషన్, ఇల్లు… ఇదే ఆయన ప్రపంచం. ఆ మధ్య బాలయ్య హోస్ట్ చేసిన టాక్ షోకి అటెండ్ అయ్యాడు. అది తప్ప, జనరల్ గా సినిమా ఈవెంట్స్ కి రావడం, మీడియాతో ఇంటరాక్ట్ అవడం, ఫ్యాన్స్ ని కలవడం వంటివి ఈ మధ్య కాలంలో జరగలేదు.
“ఆదిపురుష్” సినిమా ప్రమోషన్ కోసం ఇప్పుడు ప్రభాస్ బయటికి రావాలి. ఈ నెలలోనే మీడియాతో ఇంటరాక్షన్, ఈవెంట్లు వంటివి ఉన్నాయి. సో, ప్రభాస్ చాలా గ్యాప్ తర్వాత ప్రొమోషన్ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
వచ్చే నెల 16న విడుదల కానుంది ‘ఆదిపురుష్’. వేసవి సెలవులు మొత్తం ముగిసిన తర్వాత సినిమాని విడుదల చేస్తుండడం వింతే.
ఐతే, ఇది బాలీవుడ్ చిత్రం. సో, బాలీవుడ్ మార్కెటింగ్ లెక్కల ప్రకారం ఈ డేట్ ని ఫిక్స్ చేశారు. సరిగ్గా 45 రోజుల టైముంది విడుదలకు. సో, ప్రభాస్ భారీగా ప్రోమోట్ చెయ్యాలి ఈ సినిమాని.