సలార్ రిలీజయ్యాక అదే పనిలో!

Prabhas Surgery

“బాహుబలి” సినిమాతో ప్రభాస్ క్రేజ్, రేంజ్ పెరిగింది. ఇండియాలోనే బిగ్ స్టార్స్ లలో ఒకరిగా నిలిచారు ప్రభాస్. ఇదంతా ఒక కోణం. ఆ సినిమా కోసం చేసిన ఫైట్స్, కసరత్తులతో హెల్త్ దెబ్బతిన్నది కూడా వాస్తవం. ఇది మరో కోణం. ముఖ్యంగా ప్రభాస్ మోకాళ్ళ నొప్పులతో నాలుగేళ్లుగా ఇబ్బంది పడుతున్నారు.

ఇప్పటివరకు అమెరికాలో, యూరోప్ లో చికిత్స చేయించుకొని మేనేజ్ చేస్తూ వస్తున్నారు. ఐతే, ఇప్పుడు డ్యాన్స్, ఫైట్స్ చెయ్యడంలో చాలా కష్టపడాల్సి వస్తోందట. ఇక సర్జరీ చేయించుకోవడమే మార్గం.

త్వరలోనే అమెరికా వెళ్లి సర్జరీ చేయించుకునే ఆలోచనలో ఉన్నారు. “సలార్” విడుదలైన వెంటనే అమెరికా వెళ్లి సర్జరీ చేయించుకుంటారట. నెల రెస్ట్ తీసుకున్నాక “ప్రాజెక్ట్ కే”, మారుతి సినిమాల షూటింగ్ పూర్తి చేస్తారట.

ప్రభాస్ కిప్పుడు 43 ఏళ్ళు. సాధారణంగా మోకాళ్ళ నొప్పులు, సర్జరీలు 60 తర్వాత అవసరం పడుతుంది. కానీ, “బాహుబలి” కోసం చేసిన రిస్కీ సంట్స్ వల్ల అతని హెల్త్ దెబ్బతిన్నది.

More

Related Stories