ఆదిపురుష్ పనుల్లో ప్రభాస్

Prabhas

ప్రభాస్ ఇటలీ నుంచి వచ్చేశాడు. ఇప్పుడు ముంబైలో ల్యాండ్ అయ్యాడు. అక్కడ టీ సిరీస్ తో కలిపి చర్చలు జరుపుతాడనేది టాక్. ప్రభాస్ సినిమాలన్నీ హిందీలో టీ సిరీస్ ప్రొడ్యూస్ చేస్తోంది. “సాహో”ని అదే సంస్థ హిందీలో విడుదల చేసింది. అలాగే, “రాధే శ్యామ్” హక్కులు కొనేసింది. ఇప్పుడు “ఆదిపురుష్” సినిమాని అన్ని భాషల్లో భారీ ఎత్తున విడుదల చెయ్యనుంది.

ప్రభాస్ ఈ వీకెండ్ దర్శకుడు ఓం రౌత్ తో కూర్చొని… “ఆదిపురుష్”కి సంబదించిన పనులు సెట్ చేస్తాడు. హీరోయిన్ ని ఫైనలైజ్ చెయ్యాలి. జనవరి నుంచి షూటింగ్ మొదలు పెట్టాలనేది ఓం రౌత్ ఆలోచన.

రామాయణం ఆధారంగా రూపొందుతోన్న సినిమా ఇది. ఎక్కువ శాతం “గ్రీన్ మ్యాట్” తో స్టూడియో లోనే తీస్తారు. అంటే… బయటి వేర్వేరు లొకేషన్ కి వెళ్లడం, సెట్స్ వెయ్యడం వంటి తతంగం ఉండదు. బ్యాగ్రౌండ్ విజువల్స్ అన్ని గ్రాఫిక్స్ లో తర్వాత యాడ్ చేస్తారు.

ప్రభాస్ ఈ సినిమాని జనవరి నుంచి మర్చి వరకు కొంత భాగం పూర్తి చేసి ఆ తర్వాత నాగ అశ్విన్ తీసే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ షూటింగ్ లో జాయిన్ అవుతాడు. ఇవన్నీ ఇప్పుడు ప్రభాస్ సెట్ చేస్తున్నాడు.

Related Stories