అవతార్… ఆదిపురుష్…

Prabhas

విజువల్ ఎఫెక్ట్స్ చూడాలనుకుంటే ఎవరైనా చెప్పే టాప్-5 మూవీస్ లో ‘అవతార్’ (Avatar), ‘స్టార్ వార్స్’ (Star Wars) సిరీస్ ఉంటాయి. త్వరలోనే ఈ లిస్ట్ లోకి ‘ఆదిపురుష్’ను కూడా చేర్చాలనేది మేకర్స్ ఆలోచన. అందుకే ఆ చిత్రాలకు పనిచేసిన విజువల్ ఎఫెక్ట్స్ టీమ్ నే ‘ఆదిపురుష్’ (Adipurush) కోసం తీసుకున్నారు.

హాలీవుడ్ లో చాలా సినిమాల్ని ఇండోర్ సెటప్ లోనే తీస్తారు. దానికి అద్భుతమైన గ్రాఫిక్స్ జతచేస్తారు. ప్రభాస్ హీరోగా రాబోతున్న ‘ఆదిపురుష్’కు కూడా ఇదే ఫార్ములా ఫాలో అవ్వబోతున్నారు మేకర్స్. ఈ సినిమా మొత్తాన్ని స్టుడియోలో గ్రీన్ మ్యాట్ లో తీయాలని నిర్ణయించారు. ఈ మేరకు విజువల్ ఎఫెక్ట్స్ టీమ్స్ తో దర్శకుడు ఓం రౌత్ తాజాగా చర్చలు పూర్తిచేశాడు.

దాదాపు 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో రాబోతోంది ‘ఆదిపురుష్’. ఈ బడ్జెట్ లో ఎక్కువ మొత్తాన్ని గ్రాఫిక్స్ కోసమే కేటాయించబోతున్నారు.

సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగా కనిపించబోతుండగా.. రావణ్ పాత్ర కోసం ఇప్పటికే సైఫ్ అలీఖాన్ ను తీసుకున్నారు. త్వరలోనే సీత పాత్ర పోషించే హీరోయిన్ ఎవరనే విషయాన్ని ప్రకటిస్తారు. 

Related Stories