లెక్కలు మార్చేస్తున్న ప్రభాస్

ఇప్పటివరకు ఓ లెక్క.. ఇకపై మరో లెక్క

ప్రభాస్ నటించిన “మిర్చి” సినిమాలో డైలాగ్ ఇది. ఇప్పుడిదే డైలాగ్ అతడి కెరీర్ కు కూడా వర్తిస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ప్రభాస్ పాన్-ఇండియా సినిమాలు చేస్తున్నాడనే మేటర్ కాదు. పాత్రల విషయంలో ప్రభాస్ లో వచ్చిన మార్పు గురించి.

బాహుబలి ముందు వరకు ప్రభాస్ పాత్రల ఎంపిక ఒకలా ఉండేది. బాహుబలి తర్వాత ఆ ఎంపిక మరోలా ఉంటోంది. మరీ ముఖ్యంగా తన అప్ కమింగ్ మూవీస్ లో ప్రభాస్ క్యారెక్టర్స్ అన్నీ వేటికవే భిన్నంగా ఉన్నాయి.

ప్రస్తుతం చేస్తున్న “రాధేశ్యామ్” సినిమాలో అమర ప్రేమికుడిలా కనిపించబోతున్నాడు ప్రభాస్. ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్-ఫిక్షన్ సినిమా చేయబోతున్నాడు. ఇందులో సూపర్ మేన్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. రీసెంట్ గా ఎనౌన్స్ చేసిన ఆదిపురుష్ సినిమాలో ఏకంగా శ్రీరాముడి గెటప్ లో కనిపించబోతున్నాడు. ఇలా తన అప్ కమింగ్ మూవీస్ లో డిఫరెంట్ క్యారెక్టర్స్ ట్రై చేస్తూ.. ఇకపై మరో లెక్క అనిపించుకుంటున్నాడు యంగ్ రెబల్ స్టార్.

ప్రభాస్ సినిమాల రేంజ్, పాత్రల వైవిధ్యం రెండూ …మిగతా తెలుగు హీరోలకు అందనంత స్థాయిలో ఉన్నాయి.

Related Stories