KGF2 టీజర్ తో ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషీ

Prabhas and KGF2

KGF2 టీజర్ సంచలనం సృష్టిస్తోంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ కి మాస్ ఆడియెన్స్ పల్స్ తెలుసు అని మరోసారి ప్రూవ్ అయింది. ఈ టీజర్ 12 గంటల్లోనే 20 మిలియన్లకి పైగా వ్యూస్ పొందింది. 2 మిలియన్ల లైకులు అందుకుంది. విజువల్స్, మ్యూజిక్, హీరోయిజం ఎలివేషన్ లో ప్రశాంత్ నీల్ మరోసారి తన మార్క్ చూపించాడు. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

ఎందుకంటే ప్రభాస్ నెక్స్ట్ మూవీ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తాడు. వీరి కాంబినేషన్లో మూవీని ఇప్పటికే ప్రకటించారు. “సలార్” పేరుతో తెరకెక్కనుంది. వచ్చేనెలలోనే షూటింగ్ మొదలు అవుతుంది. KGF2 టీజర్ చూసిన తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ధీమాగా ఉన్నారు. ప్రభాస్ ని ఇంకా అద్భుతంగా ప్రశాంత్ నీల్ చూపిస్తాడనేది వారి నమ్మకం.

ప్రభాస్ కి ఉన్న పాన్ ఇండియా అప్పీల్, బిజినెస్ రేంజ్ తో ప్రశాంత్ నీల్ ఇంకా లావిష్ గా, గ్రాండ్ గా తియ్యగలడు అని ఫ్యాన్స్ డిస్కస్ చేసుకుంటున్నారు. నీల్ ప్రభాస్ మూవీని స్పీడ్ గా పూర్తి చేసి ఈ ఇయర్లోనే విడుదల చేయాలనుకుంటున్నాడు.

Advertisement
 

More

Related Stories