
టాలీవుడ్ లో ఒకేసారి నాలుగు సినిమాలను సెట్స్ మీద ఉంచిన బిగ్ హీరో ఎవరు ఆంటే ప్రభాస్ అనే చెప్పాలి. రాధే శ్యామ్ షూటింగ్ చివరి దశకు చేరుకొంది. 2018లో మొదలైన ‘రాధేశ్యామ్’ ఇప్పటివరకు షూటింగ్ పూర్తి చేసుకోకపోవడమే ఒక విచిత్రం. ఇంకా పది రోజుల చిత్రీకరణ మిగిలి ఉందట.
ఐతే, ‘రాధేశ్యామ్’ రిలీజ్ కాకముందే మూడు సినిమాలు ఒప్పుకున్నారు ప్రభాస్. ఆ మూడు సినిమాలు ఇప్పుడు సెట్స్ పైకి వచ్చాయి.
ఇప్పటికే ప్రశాంత్ నీల్ తీస్తున్న ‘సలార్’ 30 శాతం షూటింగ్ పూర్తి చేసుకొంది. అలాగే, ఓం రౌత్ తీస్తున్న ‘ఆదిపురుష్’ 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకొంది. ఈ రోజు దర్శకుడు నాగ్ అశ్విన్ తీస్తున్న సైన్స్ ఫిక్షన్ మొదలైంది. అంటే, ఒకేసారి నాలుగు సినిమాలు ఇప్పుడు సెట్స్ పై ఉన్నాయి.
ఈ నాలుగు చిత్రాల్లో ‘రాధే శ్యామ్’ ఒక నెలలో పూర్తి అయిపోతుంది. ‘సలార్’, ‘ఆదిపురుష్’ సినిమాలు ఈ ఏడాది చివరి నాటికి షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోకి వెళ్తాయి. వచ్చే ఏడాది నాగ్ అశ్విన్ సినిమాకి పూర్తిగా డేట్స్ పోతాయి. అలాగే, మరో సినిమాని కూడా ఒప్పుకుంటారట.
ఈ ఏడాది ‘రాధేశ్యామ్’ విడుదల చేసి, వచ్చే ఏడాది ‘సలార్’, ‘ఆదిపురుష్’ విడుదల చెయ్యాలనేది ప్రభాస్ ప్లాన్. ఐతే, కోవిడ్ సంక్షోభం ఎలా మలుపు తిరుగుతుంది అనే దాన్ని బట్టి విడుదల తేదీలు ఆధారపడి ఉంటాయి.