ట్రెండింగ్ లో ప్రభాస్ పాత ఫొటో

ఈ కాలం ఏది ట్రెండ్ అవుతుందో అస్సలు చెప్పలేం. ఇది కూడా అలాంటిదే.  ప్రభాస్ కెరీర్ తొలినాళ్లలో తీసిన ఓ స్టిల్ ఇది. ప్రస్తుతం ఈ స్టిల్ ట్రెండ్ అవుతోంది.

వచ్చేనెలలో ప్రభాస్ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోబోతున్నాడు. దానికి సంబంధించి ఇప్పట్నుంచే అతడి అభిమానులు సోషల్  మీడియాలో ట్రెండింగ్ షురూ చేశారు. ఆ ట్రెండింగ్ లో భాగంగా ప్రభాస్ కు చెందిన రకరకాల స్టిల్స్, వీడియో క్లిప్స్ పోస్ట్ చేస్తున్నారు.

ఆ క్రమంలో తెరపైకొచ్చిన ఈ స్టిల్ ఇనిస్టెంట్ గా వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ పిక్ ఇంత వైరల్ అవ్వడానికి రీజన్ ఏంటో గెస్ చేయగలరా..? ఎక్కువమంది నెటిజన్లు చెప్పిన సమాధానం ఏంటంటే… క్లీన్ షేవ్ లో ప్రభాస్ కనిపించిన స్టిల్ అంట ఇది. ఎందుకంటే కొన్నేళ్లుగా ప్రభాస్ అంతోఇంతో గడ్డంతోనే కనిపిస్తున్నాడు మరి.

Related Stories