
ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ సినిమా పబ్లిసిటీని మళ్ళీ మొదలుపెడుతుంది టీం. మార్చి 2న నిమిషం నిడివి ఉండే ట్రైలర్ రానుంది. దీన్ని రిలీజ్ ట్రైలర్ పేరుతో విడుదల చేస్తున్నారు. ఇది సినిమాకి కర్టన్‌రైజర్ లాంటిది అని చెప్తోంది టీం.
‘రాధేశ్యామ్’ మార్చి 11 న విడుదల కానుంది. సినిమాలో ఏమి ఉంటుందో పక్కాగా తెలియజేయడం కోసం ఈ ట్రైలర్ రూపొందించారట. బుధవారం ముంబాయ్ లో మీడియా సమక్షంలో ఈ ట్రైలర్ ని విడుదల చేస్తున్నారు ప్రభాస్.
దీంతో పెద్ద ప్రమోషనల్ క్యాంపెన్ షురూ అవుతుంది. మార్చి 10 వరకూ నాన్‌స్టాప్ గా ప్రమోషన్స్ లో ప్రభాస్ పాల్గోంటాడట. మీడియాకి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేందుకు సిద్ధమయ్యాడట. పూజ హెగ్డే కూడా పబ్లిసిటీ మొదలుపెట్టనుంది.
‘రాధే శ్యామ్’ పూర్తిగా రొమాంటిక్ చిత్రం. పూజ, ప్రభాస్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు, విజువల్స్ మెయిన్ హైలెట్ అని అంటున్నారు. ఈ సినిమాకి రాజమౌళి వాయిస్ ఓవర్ ఇవ్వడం స్పెషలిటీ.