ప్రభాస్ కి బలం కృష్ణంరాజే!

Prabhas and Krishnam Raju

నేడు ప్రభాస్ పాన్ ఇండియా స్టార్. భారతదేశంలో టాప్ హీరోల్లో ఒకరు. ఐతే, ప్రభాస్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది మాత్రం కృష్ణంరాజు వారసుడిగానే. కృష్ణంరాజు సోదరుడు కొడుకు ప్రభాస్. తన సొంత కొడుకుగానే ప్రభాస్ ని చూసుకున్నారు కృష్ణంరాజు. తన నట వారసుడిగా ప్రభాస్ ని లాంచ్ చేశారు కృష్ణంరాజు ‘ఈశ్వర్’ చిత్రంతో.

మొదట ప్రభాస్ కి అండగా నిలబడిన వారంతా కృష్ణంరాజు అభిమానులే. ఆ తర్వాత ప్రభాస్ కి సొంతంగా ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ప్రభాస్, కృష్ణంరాజు కలిసి ‘రెబెల్’, ‘బిల్లా’, ‘రాధేశ్యామ్’ చిత్రాల్లో నటించారు.

‘బాహుబలి’ చిత్రంతో ప్రభాస్ జాతీయస్థాయిలో పాపులారిటీ తెచుకున్నప్పుడు కృష్ణంరాజు ఆనందానికి అవధుల్లేవు. ప్రభాస్ సక్సెస్ ఆయనకి బాగా ఆనందాన్నిచ్చింది. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అంటూ గర్వంగా చెప్పుకునేవారు.

Krishnam Raju and Prabhas

కృష్ణంరాజుకి ముగ్గురు అమ్మాయిలు. పెద్దమ్మాయి ప్రసీద ఇటీవలే నిర్మాతగా మారారు. ప్రభాస్ ఇప్పుడు వారందరికీ అండ.

 

More

Related Stories