
తన జీవితంలో మరుపురాని సంఘటనను గుర్తుచేసుకున్నాడు యాంకర్ కమ్ నటుడు ప్రదీప్. తను జీవించి ఉన్నంతకాలం ఆ సంఘటన తన మనసులో అలా సజీవంగా ఉండిపోతుందని చెబుతున్నాడు. ఆ మరపురాని గుర్తుకు కారణం మెగాస్టార్ చిరంజీవి.
యాంకర్ గా ఓ మోస్తరు గుర్తింపు తెచ్చుకున్న తర్వాత, ఓ వేడుకకు వెళ్లాడట ప్రదీప్. అక్కడకు ముఖ్య అతిథిగా చిరంజీవి కూడా హాజరయ్యారు. ప్రదీప్ ను చూసిన చిరంజీవి, అతడ్ని పేరు పెట్టి పిలిచారట. తన యాంకరింగ్ ను మెచ్చుకున్నారట. మరీ ముఖ్యంగా ప్రదీప్ తెలుగు ఉచ్ఛారణను ప్రత్యేకంగా ప్రశంసించారట.
చిరంజీవి లాంటి లెజెండ్ తనను పేరుపెట్టి పిలవడం, ప్రత్యేకంగా మెచ్చుకోవడాన్ని జీవితంలో మరిచిపోలేనంటున్నాడు ప్రదీప్. ఆ క్షణం తను గడ్డకట్టుకుపోయానని, కొన్ని సెకెండ్ల పాటు శరీరం చల్లగా అయిపోయిందని అంటున్నాడు. తన జీవితాంతం ఆ ఘటన హృదయంలో ఫ్రెష్ గా అలా నిలిచిపోతుందంటున్నాడు ఈ స్టార్ యాంకర్.