ప్రదీప్ పొంగల్ కి వస్తాడా?

30 Rojullo Preminchadam Ela movie still

మళ్ళీ థియేటర్లు తెరుచుకున్నాయి. ‘సోలో బ్రతుకే సో బెటర్” సినిమా విడుదల (డిసెంబర్ 25)తో సినిమా థియేటర్ల వ్యాపారం మళ్లీ మొదలైనట్లే. అందుకే, సంక్రాంతికి రామ్ నటిస్తున్న “రెడ్”, రవితేజ నటిస్తున్న “క్రాక్” రిలీజ్ కాబోతున్నాయి. ఐతే సంక్రాతి సినిమాల లిస్ట్ లో కూడా టీవీ పాపులర్ యాంకర్ ప్రదీప్ నటించిన సినిమా మాత్రం రావడం లేదు.

హీరోగా తాను నటించిన తొలి సినిమా రిలీజ్ గురించి ప్రదీప్ పెదవి విప్పడం లేదు. ప్రదీప్ నటించిన “30 రోజుల్లో ప్రేమించడం ఎలా” నిజానికి ఈ ఈఏడాది మార్చిలో విడుదల కావాలి. కానీ లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. ఓటీటీలో రిలీజ్ చేసి ఉంటే… బాగుండేది. కానీ హీరోగా తన మొదటి సినిమాను OTT లో రిలీజ్ చేస్తే తన కెరీర్ కి మంచిది కాదనే ఆలోచనతో ప్రదీప్ డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కి ఒప్పుకోలేదు.

ఇప్పుడు సరైన రిలీజ్ డేట్ దొరకడం లేదు. సంక్రాంతికి రావాలా? లేక ఫిబ్రవరిలోనా అన్న విషయంలో ప్రదీప్ ఇంకా కన్ఫ్యూజన్ లో ఉన్నాడట.

More

Related Stories