ఆ కేసులో నేను లేను: ప్రదీప్

Truth Behind The False Allegations | Pradeep Machiraju

యాంకర్ ప్రదీప్ మరోసారి ఫైర్ అయ్యాడు. ఓ సున్నితమైన కేసులో తన పేరును ప్రస్తావించినందుకు కొన్ని వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానెళ్లపై ఆగ్రహం వ్యక్తంచేశాడు. నిజానిజాలు తెలుసుకోకుండా తన పేరు మీద, తన ఫొటోలు పెట్టి తప్పుడు వార్తలు రాయడం దారుణమన్న ప్రదీప్.. కొంతమంది తనను మెంటల్లీ రేప్ చేస్తున్నారని అన్నాడు.

కొన్ని సైట్లు, యూట్యూబ్ ఛానెళ్లు. మానసిక క్షోభకు తనకు గానీ, తన కుటుంబానికి ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారని ప్రశ్నిస్తున్నాడు ప్రదీప్. తనపై జరుగుతున్న ఈ తప్పుడు ప్రచారంపై లీగల్ గా చర్యలు తీసుకుంటానని స్పష్టంచేసిన ప్రదీప్.. తన ప్రతిష్టకు భంగం కలిగించిన వ్యక్తులెవ్వర్నీ వదిలిపెట్టనని హెచ్చరించాడు.

నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన పాతికేళ్ల యువతి.. తనపై 140 మంది అత్యాచారానికి పాల్పడ్డారంటూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేసింది. ఈమెపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తుల జాబితా ఇదేనంటూ ఓ లిస్ట్ సోషల్ మీడియాలోకి రావడం, అందులో యాంకర్ ప్రదీప్ అనే పేరు ఉండడం సంచలనంగా మారింది.ఆ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశాడు ప్రదీప్.

Related Stories