డబుల్ ధమాకా: ప్రగతి

వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన ‘ఎఫ్ 2’ సినిమాకి సీక్వెల్ గా వస్తోంది… ఎఫ్ 3. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి ప్రగతి కీలక పాత్ర పోషిస్తున్నారు. మొదటి భాగంలో ఆమె తమన్న, మెహ్రీన్ లకు తల్లిగా నటించారు. మరి రెండో భాగంలో కూడా అదే పాత్రలో కనిపించాలి కదా. “నా పాత్రలో మార్పులు లేవు. కథలో కొన్ని మార్పులు ఉన్నాయి,” అని చెప్తున్నారు ప్రగతి.

మరి ఈ సీక్వెల్ లో పాత్ర పెరిగిందా, తగ్గిందా? “మొదటి భాగం కన్నా రెండో దాంట్లో వినోదం పెరిగింది. ఒక విధంగా చెప్పాలంటే ప్రేక్షకులకు డబుల్ ధమాకా. అలాగే నా పాత్ర కూడా కొంత పెరిగింది,” అనేది ఆమె మాట.

దర్శకుడు అనిల్ రావిపూడిని, నిర్మాత దిల్ రాజుని తెగ పొగిడేశారు ప్రగతి. ” అనిల్ సినిమాల్లో వినోదం లార్జర్ థన్ లైఫ్ ఉంటుంది. ఆయన పాత్రలు మన జీవితాలను ప్రతిబింబిస్తాయి. ఇక దిల్ రాజు గారు అంటేనే కుటుంబ కథా చిత్రాలకు పెట్టింది పేరు. ఆయన బేన‌ర్‌లో న‌టించ‌డం ఆనందంగా ఉంది.”

“ఎఫ్ 2″లో కన్నా ఎక్కువ వినోదం ఉంది కాబట్టి సినిమా ఈ వేసవిలో పూర్తిగా పైసా వసూల్ ఎంటర్ టైనర్ గా మిగులుతుందని ఆమె ధీమాగా చెప్తున్నారు.

 

More

Related Stories