
‘అఖండ’ సినిమా ప్రగ్యా జైస్వాల్ కెరీర్ లో భారీ మూవీ. ఆమె కెరీర్ కి ఊతం ఇచ్చే చిత్రం. సినిమా బ్లాక్ బస్టర్ ఐతే ఆమెకి మరిన్ని పెద్ద సినిమాలు వరిస్తాయి. అందుకే, ఈ సినిమా హిట్ కోసం ఆమె ప్రయత్నాలు మొదలుపెట్టింది. సోషల్ మీడియాలో బాగా ప్రోమోట్ చేస్తోంది. ఈ సినిమా హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేరు. అందుకే, ఆమె స్వయంగా ఇన్ స్టాగ్రామ్ లో, ట్విట్టర్లో ‘అఖండ’కి ప్రచారం కల్పిస్తోంది.
అంతేకాదు, పనిలో పనిగా బోయపాటిని, బాలయ్యని ఇంటర్వ్యూలలో తెగ పొగిడేస్తోంది. “బాలయ్యలో ఇంత ఎనర్జీ ఏంటి? అలుపు లేకుండా అలా ఎలా పనిచేస్తారో! ఇంతగా యాక్టివ్ గా ఉండడం మనిషికి సాధ్యమేనా?,” అంటూ ఆమె ఆశ్చర్యంతో కూడిన ప్రశంసలతో కూడిన మస్కా రాస్తోంది.
ఇక బోయపాటి గురించి పొగడ్తలను కూడా చాలానే మూటకట్టింది. “ఏ పాత్రకి ఎవర్ని తీసుకోవాలో బోయపాటికి తెలిసినట్లుగా మరొకరికి తెలియదు,” అని కాంప్లిమెంట్ ఇచ్చింది.
ALSO CHECK: Pragya Jaiswal at Akhanda event
ఏ మాటకామాట చెప్పుకోవాలి…. ఈ సినిమా ఇండస్ట్రీలో పొగడ్తలకే ఎక్కువ అవకాశాలు వస్తాయి. ఆ కిటుకు తెలుసుకొంది ఈ భామ.