బాలయ్యని పొగిడేస్తోన్న భామ

నందమూరి బాలకృష్ణ ఎనర్జీ గురించి స్పెషల్ గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. 60 ప్లస్ ఏజ్ లోనూ బాలయ్య చాలా దూకుడుగా ఉంటారు. సెట్ లో కూడా అలాగే ఉంటారట.

“ఆయన ఒక ట్రాన్స్ ఫార్మర్. ఎప్పుడూ ఫుల్ ఎనర్జీతో ఉంటారు. ఆయన సెట్ లోకి అడుగుపెడితే ఆటోమాటిక్ గా వాతావరణం మారిపోతుంది. దర్శకుడి ఏది చెప్తే అది చేస్తారు. సినిమా అంటే ఆయనకి ఉన్న డెడికేషన్ గ్రేట్. ఇన్నేళ్ల కెరీర్ తర్వాత కూడా ఆయన అంతే ప్యాసన్ తో ఉండడం నాకు ఏంతో స్ఫూర్తినిస్తోంది,” ఇలా పొగడ్తల మాల వేసింది హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్.

ఆమె ప్రస్తుతం బాలయ్య సరసన నటిస్తోంది. బోయపాటి డైరెక్షన్లో బాలయ్య హీరోగా రూపొందుతోన్న మూడో చిత్రం షూటింగ్ కొనసాగుతోంది. మే 28న విడుదల కానున్న ఈ మూవీలో ఐఎఎస్ ఆఫీసర్ పాత్రలో ప్రగ్య కనిపిస్తుంది.

బాలయ్యతో ఇప్పటికే పలు సీన్లు, సాంగ్స్ పూర్తి చేసింది ఈ ‘కంచె’ కథానాయకి. దాంతో బాలయ్యని తెగ పొగిడేస్తోంది.

More

Related Stories