
‘అఖండ’ సినిమాతో మంచి హిట్ అందుకున్న బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ ఇప్పుడు బాలీవుడ్ పై కన్నేసింది. ఆమె తాజగా సల్మాన్ ఖాన్ సరసన కనిపించింది. ఒక హిందీ ఆల్బమ్ కోసం సల్మాన్ ఖాన్, ప్రగ్య కలిసి నటించారు. ఒక పాటలో ఆమె సల్మాన్ తో స్టెప్పులేసింది.
ఈ పాటకి మంచి రెస్పాన్స్ వస్తోందట.
“సల్మాన్ ఖాన్ సార్‌తో పనిచేయాలని ప్రతి నటి కోరుకుంటుంది. నేను సినిమాల్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి సల్మాన్ తో నటించే అవకాశం కోసం ఎదురు చూశాను. ఆ కల ఇప్పుడు నిజమైంది. హిందీలో నా తొలి ప్రాజెక్టు ఆయనతోనే కావడం అదృష్టం. సల్మాన్‌సార్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు గర్వంగా ఉంది,” అని మురిసిపోతోంది ప్రగ్య.
ALSO CHECK: Pragya Jaiswal’s Black Magic Pics
” ఈ సాంగ్ బ్యూటీఫుల్ గా ఉంది. గురు రంధ్వ, లులియా వంతూర్ ఈ రొమాంటిక్ మెలోడీని అద్భుతంగా ఆలపించారు. ఈ పాటలో ఉన్నది నేనేనా అనిపిస్తోంది…అంత అందమైన సాంగ్ ఇది,” అని చెప్పింది ప్రగ్య.