
ఎన్నికలు ఎప్పుడు?
ఇది ప్రకాష్ రాజ్ సంధించిన ప్రశ్న. “జస్ట్ అస్కింగ్” అంటూ ప్రకాష్ రాజ్ ఈ రోజు ట్వీట్ చేశారు? ఏ ఎన్నికల గురించి మాట్లాడుతున్నారో ఆయన తన ట్వీట్లో ఎక్కడా పేర్కొనలేదు.
కాకపోతే, ‘మా’ అధ్యక్షుడిగా పోటీ పడుతున్నట్లు ఆయన ఇంతకుముందే చెప్పారు కాబట్టి దాని గురించే అనుకోవాలి. ఎన్నికలు ఎప్పుడు పెడుతారో తెలీకుండానే ఆయన పోటీలోకి దిగుతున్నారా? మీడియాలోకి వచ్చి అంత హడావిడి చేశారా?
మొన్నే ఆయన ఒక ప్రెస్ మీట్లో మీడియాపై చిందులేశారు. సెప్టెంబర్ లో జరిగే మా ఎన్నికలకు మీడియా ఎందుకు హడావిడి చేస్తోంది అని ప్రశ్నించారు. మరి సెప్టెంబర్ లో జరుగుతాయని క్లారిటీ ఉన్నప్పుడు జులై 6న ప్రకాష్ రాజ్ కి డౌట్ ఎందుకు వచ్చింది. ఈ ఎన్నికల విషయంలో ప్రకాష్ రాజ్ కి ఇంత ఆత్రం ఎందుకో? లేదా ఎన్నికలు నిర్వహించకుండా… ఇప్పటి అధ్యక్షుడు నరేష్ ఇంకో రెండేళ్లు తానే ఉంటారని ప్రకాష్ రాజ్ అనుమానిస్తున్నారా?