
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేని ఈ రోజు (ఫిబ్రవరి 20) ముంబైలో కలిసి రాజకీయ చర్చలు జరిపారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. బీజేపీకి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో ఫ్రంట్ ఏర్పరిచేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు.
ఈ మీటింగ్ లో నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఉండడం విశేషం.
ప్రకాష్ రాజ్ కి, బీజేపీ అంటే అస్సలు గిట్టదు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఆయన చాలాకాలంగా క్యాంపెన్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో బెంగుళూరులోని ఒక నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. మొన్న ‘మా’ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ నిలబడినప్పుడు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అతన్ని ఓడించాలని పిలుపునిచ్చారు. ప్రకాష్ రాజ్, బీజేపీకి మధ్య అంత వైరం ఉంది.
సో, ప్రకాష్ రాజ్ కూడా ముంబై వెళ్లారు కేసీఆర్ వెంట. బీజేపీని నిలువరించాలని కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు ప్రకాష్ రాజ్ మద్దతు ఇస్తున్నట్లు ఉంది.