జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రకాష్ రాజ్

Prakash Raj

‘భీమ్లానాయక్’ సినిమా విడుదల సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సృష్టించిన అడ్డంకులు, హడావిడి అందరూ చూశారు. నిబంధనల పేరుతో వై.ఎస్.జగన్ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ పై రాజకీయం చేసింది అనేది వాస్తవం. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ అభిమానులు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రమే ఈ విషయంలో జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఇప్పుడు ప్రకాష్ రాజ్ గళం విప్పారు.

“సృజన, సాకేంతిక మేళవించిన సినిమా రంగంపై అధికార దుర్వినియోగం, ఆధిపత్య ధోరణి ఏమిటి? చిత్ర పరిశ్రమని క్షోభ పెడుతూ మేమే ప్రోత్సహిస్తున్నామంటే నమ్మాలా? ఏవైనా ఉంటే రాజకీయ క్షేత్రంలో చూసుకోవాలి. కక్ష సాధింపులు బాక్సాఫీస్ దగ్గర ఎందుకు? ఎంతగా ఇబ్బంది పెట్టినా ప్రేక్షకుల ఆదరాభిమానులకు ఎవరూ అడ్డుకట్ట వెయ్యలేరు,” అని ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు.

‘భీమ్లా నాయక్’ మంచి కలెక్షన్లు సాధిస్తూ ముందుకు సాగుతోంది. ఐతే, ప్రకాష్ రాజ్ ట్వీట్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ, ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఐతే, ప్రకాష్ రాజ్ ప్రస్తుతం తెరాస పార్టీతో సాగుతున్నారు. ఈ విషయంలో వైసీపీ ఎక్కువగా మాట్లాడకపోవచ్చు.

Advertisement
 

More

Related Stories